సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: డాక్టర్ బి.వి.రాజు ఫౌం డేషన్ మరియు శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ భీమవరం, వారి విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు ఎస్.ఏ.ఈ ఇండియా వారిచే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇండోర్ (మధ్యప్రదేశ్) నందు నిర్వహించిన జాతీయస్థాయి HCNG బాహా పోటీలో మొదటి స్థానంలో నిలిచి లక్షా ముప్పై వేల రూపాయల నగదు బహుమతిని సాధించారని ప్రిన్సిపాల్ డాక్టర్ మంగం వేణు తెలియజేశారు. ఎస్.ఏ.ఈ ఇండియా వారు జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పెట్రోలు మరియు డీజిల్ కాలుష్యానికి దూరంగా హైడ్రోజన్ తో నడిచే వాహనాల తయారీ కోసం నిర్వహించిన HCNG బాహా పోటీలో దేశం నలుమూలల నుండి ఇంజనీరింగ్ విద్యార్థులు తయారు చేసిన ఆల్ టెరేన్ వాహనాలు ప్రదర్శించి, వాటి పనితీరును పరీక్షిస్తారని, ఈ పోటీలో తమ విష్ణు కళాశాల నందలి మెకానికల్ మరియు AIML విద్యార్థుల బృందం (టీం అమిగోస్) తయారు చేసిన హైడ్రోజన్ వాహనం విజేతగా నిలవడంతోపాటుగా ఐదు విభాగాలలో (ఇంజనీరింగ్ డిజైన్, ఎండ్యూరెన్స్ పెర్ఫార్మెన్స్, సస్టైనబిలిటీ, స్పెషాలిటీ మరియు యాక్సిలరేషన్) ప్రధమ స్థానంలో నిలచి నగదు పురస్కారాన్ని, అవార్డును అందుకుందని గర్వంగా తెలియజేస్తూ చక్కని పనితీరును ప్రదర్శించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ అభినందించారు.
