సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగుదేశం పార్టీ యువనేత, మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భముగా తెలుగు రాష్ట్రాలలో అమెరికా నుండి అన్ని వైపులా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి.. లోకేష్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ”ప్రియమైన లోకేశ్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. తెలుగు ప్రజలకు సేవ చేయాలనే మీ నిర్విరామ కృషి, అభిరుచితో ఏపీ మరింత అభివృద్ధి సాధించేలా పాటుపడటం హర్షణీయం. మీరు చేసే అన్ని ప్రయత్నాలలో విజయం సాధించండి. ఈ ఏడాది అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నా” అని చిరంజీవి పేర్కొన్నారు. ప్రస్తుతం చిరంజీవి ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక పుట్టినరోజు సందర్బంగా దావోస్ లో ఉన్న లోకేష్ కు తల్లిదండ్రులు సీఎం చంద్రబాబు, భువనేశ్వరి, తన కుటుంబ సభ్యులు ఆయనకు ఆశీర్వచనాలు అందించారు.
