సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ ఫైర్ బ్రాండ్ , మాజీ మంత్రి రోజా నేడు, శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు, లోకేష్ ల రాష్ట్రంలో విదేశీ సంస్థల పెట్టుబడులకు చేసిన పర్యటన అట్టర్ ప్లాప్ అయ్యిందని విమర్శించారు. ప్రక్క రాష్ట్రాల సీఎంలు దావోస్ వెళ్లి భారీ పెట్టుబడులు మంచి కంపెనీలు వారి రాష్ట్రాలకు వచ్చేందుకు ఒప్పందాలు చేసుకొంటే .. మన వాళ్ళు ఖాళీ చేతులతో వచ్చారని విమర్శించారు. జగన్ హయాంలో ఆర్హిక అభివృద్ధి ప్రజా సంక్షేమం, ఎన్నో పోర్టుల నిర్మాణాలతో రాష్ట్రము లో లా అండ్ ఆర్ధర్ చక్కగా ఉండేదని, అందుకే రిలయన్స్, అదానీ ,జిందాల్ గ్రూపులు భారీ పెట్టుబడులు పెట్టాయి. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో లోకేష్ ఎర్ర బుక్ పాలసీతో, పైగా రాష్ట్రము 10 లక్షల కోట్లు పైగా అప్పులలో ఉందని ఆదుకోవాలని చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారంతో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బ తిని ఎవరు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి రావడం లేదని ఆరోపించారు. అసలు ఉప ముఖ్యమంత్రి పవన్ కు దావోస్ ఎందుకు తీసుకొని వెళ్ళలేదు? పవన్ వస్తే . లోకేష్ స్థాయి తగ్గుతుందనా? అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు తో వెళ్లిన దావోస్ వెళ్లిన మంత్రి వర్గ బృందానికి పెట్టిన ఖర్చు రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు భారం మిగిలిచిందని ప్రయోజనం లేదని ఎద్దేవా చేసారు.
