సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ 76 గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు, ఆదివారం న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, కేంద్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు..కర్తవ్య పథంలో జరిగిన కవాతును దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సంగీత వాయిద్యాలతో కూడిన 300 మంది సాంస్కృతిక కళాకారుల బృందం ‘సారే జహాన్ సే అచ్ఛా’ ప్రదర్శించారు.. ఇక నేటి రిపబ్లిక్ వేడుకల్లో బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణులు, పినాక మల్టీబ్యారెల్ రాకెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కర్తవ్య పథ్‌పై హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి. రాష్ట్రపతి భవన్ నుంచి ఎర్రకోట వరకు దాదాపు 9 కిలోమీటర్ల మేర రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన 31 శకటాలను ఇందులో ప్రదర్శించారు. ఈ జనవరి 29న విజయ్ చౌక్‌లో జరిగే ‘ బీటింగ్ రిట్రీట్ సెర్మనీ’తో గణతంత్ర దినోత్సవ వేడుకలు ముగుస్తాయి.
