సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, ఆదివారం భీమవరంలో తన కార్యాలయంలో రిపబ్లిక్ వేడుకలు జరుపుకున్న తదుపరి ఎమ్మెల్యే అంజిబాబు భీమవరం ఆనంద పంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరం, ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష శిబిరం, ఉచిత చర్మ సంబంధిత వ్యాధుల శిబిరాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ .. చర్మ వ్యాధులకు సంబంధించి, క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షల ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. క్యాన్సర్ పై అవగాహన ఎంతో అవసరమని, ముందుగానే క్యాన్సర్ ను గుర్తిస్తే చికిత్స అందించవచ్చునని అన్నారు. ప్రముఖ సర్జికల్ అంకాలజిస్ట్ డా అల్లూరి వంశీకృష్ణ, చర్మ వ్యాధుల నిపుణురాలు డా ప్రియాంక వర్మ మాట్లాడుతూ క్యాన్సర్ పై మహిళల్లో మరింత అవగాహన అవసరమని, మొహమాటం వదిలి ప్రతి ఒక్కరూ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని, క్యాన్సర్ ను ముందుగా గుర్తించడం వల్ల నయం చేసేందుకు అవసరమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయని వారు అన్నారు. అనంతరం సుమారు వందలాది మంది వైద్య పరీక్షలను నిర్వహించుకున్నారు. కార్యక్రమంలో పొత్తూరి బాపిరాజు, యర్రంశెట్టి శివకృష్ణ, కారుమూరి సత్యనారాయణ మూర్తి, వేంకటపతి రాజు, పిఎస్ఎన్ రాజు, పలువురు వైద్యులు పాల్గొన్నారు.
