సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నందమూరి బాలకృష్ణ కు కేంద్ర ప్రభుత్వ ‘పద్మ భూషణ‘ సత్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు దశాబ్దాలుగా అత్యంత సన్నిహితుడు మిత్రుడు, ఉండి ఎమ్మెల్యే , ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఉప సభాపతి రఘురామా కృష్ణంరాజు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ కళాకారుడిగా తండ్రి తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్ కు తగ్గ తనయుడిగా ఇప్పటికి చిత్ర పరిశ్రమలో ఇటీవల వరుసగా 4 ఘన విజయాలతో , ఆన్ స్టాపబుల్ షోలతో, హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అశేష అభిమానులను, ప్రజలను అలరిస్తున్న తెలుగు తేజం బాలయ్య ఈ సత్కారం సముచితమే .. ముందుముందు మరిన్ని సత్కారాలు, అపూర్వ చిత్రాలలో నటించాలని కోరుతూ.. బాలయ్య తో తన సంతోషకర స్ముతులను తలచుకొంటూ హర్షం ప్రకటించారు. రఘురామా కృష్ణంరాజు రాష్ట్ర ప్రజలకు రిపబ్లిక్ డే శుభాబినందలు తెలిపారు.
