సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ మరియు డాక్టర్ బి.వి.రాజు ఫౌండేషన్, విష్ణు స్కూల్ ఆవరణలో నిన్న గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విష్ణు స్కూల్ ప్రిన్సిపల్, ఎల్. బిందు జాతీయ పతాకావిష్కరణ చేసారు. విద్యార్ధులందరూ చిన్ననాటి నుండి విద్యార్థి దశలో దేశభక్తిని అలవరచుకొని చక్కని క్రమశిక్షణతో విద్యాభ్యాసము చేసి దేశాభివృద్ధికి పాటుపడాలని, మనదేశంలో స్వాతంత్య్రం సాధించడం కోసం మన దేశ నాయకులు చేసిన కృషిని, త్యాగాలను ఆమె వివరించారు. ఈ సందర్భంగా విష్ణు స్కూల్ చిన్నారులు ప్రదర్శించిన వివిధ నృత్యగానాలు, దేశభక్తి గీతాలు, స్వతంత్ర సమర యోధుల వేషాలలో చిన్నారులు ప్రదర్శించిన లఘు నాటికలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో విష్ణు విద్యాసంస్థల క్యాంపస్ డైరెక్టర్ జె. ప్రసాదరాజు, డి.జి. ఎమ్ . శ్రీ ఎమ్ రమేష్ రాజు, స్టూడెంట్ ఎఫైర్స్ డైరెక్టర్ శ్రీ పి. శ్రీనివాసరాజు వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్ ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర బృందము, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
