సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో ఇటీవల పెరిగిపోతున్న బంగారం, వెండి ధరలు మరోసారి నేడు, శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారం రూ.76,250 ఉండగా.. నేడు శుక్రవారం (31-01-2025) 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.76,260కు చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర నిన్న రూ.83,170 ఉండగా.. తులానికి రూ.10 పెరిగి నేడు రూ.83,180 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్, విజయవాడ , విశాఖపట్నం లలో 22 క్యారెట్స్ 10గ్రాముల బంగారం – రూ.76,110 కు చేరుకొంది. నిన్న వెండి కిలో ధర కిలో ధర రూ.1,06,000 ఉండగా నేడు రూ.100 పెరిగి 1,06,100కు చేరింది
