సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ఆర్యవైస్యుల ఆధ్వర్యంలో స్థానిక త్యాగరాజ భవనంలో శ్రీమాతా వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. శ్రీ అమ్మవారికి పట్టు వస్త్రాలను అందించి పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని 450 మంది సువాసినీలతో మూల గాయత్రి మంత్రములతో కుంకుమార్చన నిగ్వహించారు. ఆర్యవైశ్య వర్తక సంఘ భవనము, యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ముందుగా గ్రామోత్సవం, రధోత్సవం, అష్టోత్తర (108 కలశములు) కలశాభిషేకం, కుంకుమార్చన, లక్ష చామంతి పూలతో లక్ష పుష్పార్చన కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి తటవర్తి బదరీ లక్ష్మీనారాయణ, యువజన సంఘం అధ్యక్షుడు జూలూరి వెంకటేష్,కారుమూరి సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
