సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. దీనిలో మధ్యతరగతి ప్రభుత్వ, ప్రెవేటు ఉద్యోగులకు ఐటి ఉద్యోగులకు, ఓదార్పు నిచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు బంపర్ న్యూస్ ఇచ్చింది. ఏకంగా 12 లక్షల లోపు ఆదాయం కలిగిన వారు ట్యాక్స్ కట్టాల్సిన పనిలేదని స్పష్టం చేసింది. కొత్త పన్ను శ్లాబులను సవరించింది కేంద్ర ప్రభుత్వం. 12 లక్షల వరకు పన్ను మినహాయింపులు ఇచ్చింది. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు. మరోవైపు సులభంగా అర్థమయ్యేలా వచ్చేవారం కొత్త ఆదాయపన్ను బిల్లును అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వ్యాపారవర్గాలకు మాత్రం కొత్త స్లాబ్ ప్రకారం రూ.0-రూ.4 లక్షలు ఆదాయం ఉంటే రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. గతంలో రూ.4-రూ.8 లక్షల ఆదాయంపై 5 శాతం, రూ.8-రూ.12 లక్షల ఆదాయంపై 10 శాతంపన్ను, రూ.12-రూ.16 లక్షల ఆదాయంపై 15 శాతం, రూ.16 నుంచి రూ.20 లక్షల ఆదాయం మీద 20 శాతం, రూ.24 లక్షల కంటే ఎక్కువ ఆదాయం కలిగిన వారికి 30 శాతం పన్ను విధించనున్నట్లు నిర్మలా సీతారమన్ తెలిపారు.
