సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం కేంద్ర వార్షిక బడ్జెట్ (2025-26)నుఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. మొత్తం రూ.50,65,345 కోట్లతో ప్రవేశపెట్టారు. బీహార్ కు నిధుల వరద పారింది అని విశ్లేషకులు భావిస్తున్నారు.. బడ్జెట్లో ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద గొప్పగా లేకపోయిన కాస్త ఊరడింపుగానే నిధులు కేటాయించింది. వాటి వివరాలు చుస్తే.. పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు, విశాఖ స్టీల్‌కు రూ.3,295 కోట్లు, విశాఖ షిపింగ్ పోర్టుకు రూ.730 కోట్లు,,జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కి రూ. 186 కోట్లు, ఏపీలో రోడ్లు, వంతెనల ప్రాజెక్టుకు రూ.240 కోట్లు, లెర్నింగ్ట్ ట్రాన్స్ఫార్మేషన్ ఆపరేషన్ కి మద్దతుగా రూ. 375 కోట్లు, ఏపీ ప్రజా ఆరోగ్య వ్యవస్థల పరిపుష్టికి రూ. 162 కోట్లు కేటాయించారు. ఈ కొత్త బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు గతేడాది కంటే రూ.400 కోట్లు అధికంగా కేటాయించిన కేంద్ర ప్రభుత్వం.. మొత్తంగా రూ.5,936 కోట్లు ఇస్తున్నట్లు బడ్జెట్లో పేర్కొంది. విశాఖ పోర్టుకు కూడా గతేడాదితో పోలిస్తే రూ.445 కోట్లు అధికంగా ఇస్తున్నామని మంత్రి నిర్మల తెలిపారు.
