సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ అద్భుతంగా ఉందని , ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల జీవన విధానాల్ని మెరుగుపరచడమే లక్ష్యంగా వారికి భారీ ఊరట కల్పించిందన్నారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అన్నారు. నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై భీమవరం లోని కేంద్ర మంత్రి క్యాంప్ కార్యాలయం ద్వారా ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం 41.15 ఎత్తు పెంచడానికి 35436.95 కోట్లు నిర్మాణ వ్యయం సవరణకు ఆమోదం తెలుపుతూ 12,500 కోట్లు బడ్జెట్లో కేటాయింపు అమోదం,విశాఖ స్టీల్ ప్లాంట్ కు మూడు వేల కోట్లు కేటాయించడం ద్వారా ఏపీ అభివృద్ధికి కేంద్రం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రుజువైందన్నారు. మన నర్సాపురం కు చెందిన ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ తన ప్రసంగాన్ని దేశమంటే మట్టి కాదోయ్‌.. మనుషులోయ్‌ అంటూ గురజాడ పద్యాన్ని ప్రస్తావిస్తూ ప్రారంభించారని అన్నారు. అన్నదాతలకు లాభం చేకూరేలా కిసాన్ క్రెడిట్ కార్డుల యొక్క పరిమితి 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడం ద్వారా సుమారుగా 8 కోట్ల మంది రైతులకు ప్రయోజనం జరిగిందన్నారు.. ఉద్యోగస్తులకు రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వటం చాలా సంచలన నిర్ణయం అన్నారు. భీమా రంగం మరింత బలపడేలా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల యొక్క పరిమితిని 74 % నుంచి 100 % శాతానికి పెంచడం చాలా మంచి నిర్ణయాలని కేంద్ర మంత్రి వర్మ తెలిపారు. స్టార్ట్ అప్ లో ప్రోత్సాహకాలు కోసం పదివేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు, దేశంలో 200 కాన్సర్ సెంటర్లను ఏర్పాటు, ఐటీ, టెలికం, విద్యుత్ రంగాలకు భారీ కేటాయింపులు ఈ బడ్జెట్లో జరిగాయన్నారు. మా భారీ పరిశ్రమల శాఖకు గతంలో లేని విధంగా 7,178 కోట్లు బడ్జెట్లో కేటాయింపులు చేయటం జరిగిందని కేంద్ర మంత్రి వర్మ తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *