సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీనియర్ కాంగ్రెస్ నేత,మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సింగనమల నుండి 2 సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, మంచి వాగ్ధాటి ఉన్న నేతగా తెలుగు రాష్ట్ర ప్రజలకు సుపరిచితులు సాకే శైలజానాద్. నేడు, శుక్రవారం వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరిపోయారు. సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఆయన చాల కాలంగా వైసీపీ తీర్ధం పుచ్చుకొంటారని వార్తలు వచ్చినప్పటికీ ఇంతకాలానికి నిజం చేసారు. రాయలసీమ ప్రజల అభివృద్ధి కోసం వారి హక్కుల కోసం వైసీపీ మాత్రమే నిజమైన వేదిక అని మాట తప్పని మడమ త్రిప్పని జగన్ నాయకత్వంలో ఇకపై పని చెయ్యాలని భావిస్తున్నానని శైలజ నాధ్ పేర్కొన్నారు. ఆయనతో పాటు ఏఐసీసీ సభ్యుడు ప్రతాపరెడ్డి కూడా వైసీపీలో చేరిపోయారు. ఇది ఒక రకంగా ఏపీలో ఉనికి చాటుకోవాలని ప్రయత్నిస్తున్న ఏపీ కాంగ్రెస్ అడ్జక్షురాలు షర్మిలకు ఇబ్బందికి గురిచేసే అంశం.
