సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్“కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జాతీయ పెన్షన్ వ్యవస్థ (ఎన్పీఎస్) పరిధిలోకి పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా స్థిర వైద్య భత్యం (ఎఫ్ఎంఏ) పొందుతారని పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ (డీఓపీపీడబ్ల్యూ) తాజాగా ప్రకటించింది. ఈ మేరకు త్వరలో అధికారిక ఉత్తర్వులు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో అధికారిక వెబ్సైట్లో ఇప్పటికే కొత్త దరఖాస్తు ఫారమ్‌లు కూడా పెట్టారు. అలాగే చెల్లింపు ప్రక్రియను కూడా స్పష్టం చేశారు. దీంతో పాటు వైద్యభత్యం కొనసాగింపు కోసం ప్రతి ఏడాది జీవిస్తున్నట్లుగా ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించడం తప్పనిసరి అని నిపుణులు అంటున్నారు. ఉద్యోగులకు వారి ప్రాథమిక వైద్య అవసరాలను తీర్చుకోవడానికి సహాయపడేలా ఈ ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ అందిస్తారు. ఎన్పీఎస్ పరిధిలోకి వచ్చే రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు స్థిర వైద్య భత్యం పొందవచ్చు. అయితే వారు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్ఎస్) స్కీమ్‌కు అర్హులై ఉండాలి. ఎన్పీఎస్ రిటైర్డ్ ఉద్యోగులకు ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ రేటు నెలకు రూ. 1,000గా నిర్ణయించింది..
