సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పుణ్యం కోసం అందరు ఒక్కసారే వెళ్ళితే అసలుకు.. ఎదో అన్నట్లు.. కుంభమేళాలో పుణ్యస్నానాలు చేయడానికి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లేందుకు ఎన్ని రైళ్లు వేసిన ఎక్కడ చుసిన కిక్కిరిసిపోతున్న జనం.. గత రాత్రి 9-40 గంటల సమయంలో ఢిల్లీలో రైల్వే స్టేషన్ లో తీవ్ర తొక్కిసలాట లో 18 మంది పైగా మరణించడం ఎందరో గాయాలు పాలవ్వడం చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల చప్పున పరిహారం చెల్లించడం చకచకా జరిగిపోయాయి. ఇంతకీ ఈ త్రొక్కిసలాట ఎందుకు జరిగిందంటే.. నేడు, ఆదివారం కావడం ఢిల్లీలో ఉన్న రైళ్లకు మించి ఆలోచన లేకుండా టికెట్స్ అమ్మటం.. అవసరానికి మించి టికెట్లను విక్రయించడం,రైల్వే స్టేషన్ వేలమంది ప్రయాణికులకు కిక్కిరిసిపోయింది. ఇంతలో ఆ రద్దీకి తగినట్లు రైళ్లు సకాలంలో నడపకపోవడం తొక్కిసలాటకు దారితీసింది. ప్రయోగరాజ్ కు వెళ్లేందుకు తంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్‌, భువనేశ్వర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఆ రెండు రైళ్లలో ప్రయాణించాల్సిన వారు, 12, 13 ప్లాట్‌ ఫామ్‌లపై వేచి ఉన్నారు. అదే సమయంలో ప్రయాగ్‌రాజ్‌ ఎక్స్‌ప్రెస్‌ రాత్రి తొమ్మిదిన్నరకు 15వ నెంబర్‌ ప్లాట్‌ఫామ్‌కు మార్పు చేశామని ప్రకటన కొద్దీ నిమిషాల ముందు ప్రకటన రావడంతో ఒక్కసారిగా అందరూ వెళ్లడానికి ప్రయాణికులు ఆ ప్లాట్ పారం మీదకు ఎగబడ్డారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఫలితంగా మెట్లపైన నిలబడ్డవారు కింద పడిపోయారు. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న మరికొందరు కూడా తొక్కిసలాటలో కింద పడిపోయారు. 13 మంది మహిళలు 4గురు పిల్లలు మరణించారు. ఆ ప్లాట్ ఫారం ఫై ఉన్న రైల్వే భద్రతా సిబ్బంది అప్రమత్తంగా లేరు. పోలీసులు, భద్రతా సిబ్బంది- ప్రయాణికులను అదుపు చేయలేకపోయారు. ఫలితంగానే మహా విషాదం జరిగింది. రైల్వే స్టేషన్ అంతటా ఆర్తనాదాలతోగాయాలు పాలయినవారు మరణించినవారి కోసం, తప్పిపోయిన పిల్లలు బంధువులు, కేకలతో మహా విషాదం రాజ్యమేలింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *