సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం సహాయ నిధి.. పేదలకు పెన్నిధని, వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. నేడు, సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 12 మంది లబ్ధిదారులకు రూ 12,61,530 ల చెక్కులను అందించారు. బాధిత కుటుంబాలకు ఎన్‌డిఎ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఆపద సమయాల్లో సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవాలని, మెరుగైన వైద్యానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందొచ్చనని అన్నారు. ఇప్పటి వరకు సుమారు 33 మందికి రూ 34,69,641 (17 మందికి రూ 12,14,846, నలుగురికి రూ 9,93265, 14 మందికి 12,61,530) లను చెక్కుల రూపంలో అందించామని అన్నారు. కార్యక్రమంలో టీడీపి , జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు పాల్గొన్నారు.
