సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ జిల్లా జైలులో వల్లభనేని వంశీని నేడు, మంగళవారం ములాఖత్ లో మాజీ సీఎం జగన్ పరామర్శించారు అరెస్ట్ కు జరిగిన పరిణామాల గురించి జగన్ వంశీని అడిగి తెలుసుకుంటున్నారు. కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని ములాఖత్‌లో జగన్ తో పాటు కలవడానికి మాజీ మంత్రులు పేర్నినాని, కొడాలి నానిల కి అనుమతి నిరాకరించారు అధికారులు. భద్రతా కారణాలతో అనుమతి ఇవ్వలేదు అని అధికారులు పేర్కొన్నారు. వంశీతో ములాఖత్ ముగిశాక బయటకు వచ్చి వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. వంశీని చంద్రబాబు లోకేష్ కుట్రతో అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోతుందని, వంశీపై కేసు పెట్టలేదని స్వయంగా సత్యవర్ధనే కోర్టుకు చెప్పాడని అన్నారు. సత్యవర్ధన్ వాంగ్మూలం కూడా నమోదు చేశారన్నారు. చంద్రబాబు ప్రోద్భలంతో వంశీపై కావాలనే తిరిగి బెయిల్ రాకుండా ఎస్ సి, ఎస్టీ క్రింద తప్పుడు కేసులు నమోదు చేసినట్లు జగన్ ఆరోపించారు. ఇదే వంశీ ని అరెస్ట్ చేసినప్పుడు సీఐ చెప్పడదట.. ఏడాదిన్నర లో రిటైర్ అయిపోతాను ఇంకేంటి ? అని .. నేను చెపుతున్నాను తిరిగి వైసీపీ అధికారంలోకి వచ్చాక నువ్వు సప్తసముద్రాల అవతల ఉన్నతీసుకోని వచ్చి న్యాయ విచారణ చేయించి, బట్టలు ఊడదీయించి నిలబెడతాను. ఇటీవల మునిసిపల్ ఎన్నికలలో రాష్ట్రంలో పలు మునిసిపాలిటీలలో అసలు ఒక్క కౌన్సిలర్ కూడా గెలవకపోయిన టీడీపీ పార్టీ వాళ్ళు ‘సిగ్గు శరం’ లేకుండా అధికారం కోసం వైసీపీ వాళ్ళను బెదిరించి చేస్తున్న అరాచకం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.ఇప్పటికే రాష్ట్రంలో వైసీపీ కీలక నేతలపై అక్రమ కేసులు పెడుతూనే ఉన్నారు. టీడీపీ పెద్దల కోసం పని చేసే ప్రతి పోలీస్ అధికారిని గుర్తుపెట్టుకొంటాం.అని జగన్ హెచ్చరించారు. జగన్ రాకతో వైఎస్సార్‌సీపీ నేతలు, శ్రేణులుపెద్ద ఎత్తున జైలు వద్దకు భారీగా చేరుకోవడంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు
