సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు, విజయవాడలో చేసిన విమర్శల నేపథ్యంలో..రాష్ట్ర విద్యాశాఖ, ఐటి మంత్రి నారా లోకేష్.. తన ఎక్స్ ఖాతా వేదికగా వ్యంగ్య బాణాలు సంధించారు. జగన్ కూటమిప్రభుత్వం ఫై చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే.. ఏకబిగిగా జగన్ పచ్చి అబద్దాలను కాన్ఫిడెంట్‌గా చెప్పడంలో మీరు పీహెచ్‌డీ చేసినట్లు ఉన్నారంటూ ఎద్దేవా చేసారు. మీరు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు అనే భ్రమలోంచి ఇకనైనా బయటకు రండి. వంశీని ఎలా వెనకేసుకొని వస్తున్నారు?. మీరు అధికారంలో ఉన్నపుడు 100 మందికిపైగా వైసీపీ రౌడీలు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేయడాన్ని కోట్లాది ప్రజలు కళ్లారా చూశారని అన్నారు. కక్ష సాధింపు, కుట్రలు, కుతంత్రాలు మీ బ్రాండ్ జగన్ రెడ్డి గారు .మీరు అధికారం ఉన్నప్పుడు యథేచ్చగా చట్టాలను తుంగలో తొక్కి.ఇప్పుడు ప్రజాస్వామ్యం, పద్ధతులు అంటూ మీరు లెక్చర్ ఇవ్వడం వింతగా ఉందంటూ మంత్రి నారా లోకేష్ విమర్శించారు.
