సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు, బుధవారం గుంటూరు మిర్చియార్డుకు వెళ్లి రైతులను కలిశారు. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉందని, మిర్చియార్డులోకి అనుమతి లేదని అధికారులు చెప్పినప్పటికీ లెక్క చేయకుండా జగన్ పర్యటించారని రాష్ట్ర మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా కు చెందిన మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ.. రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదన్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో 14 వేల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో నిలిపేసిన పోలవరం పనులు సీఎం చంద్రబాబు పరుగులు తీయిస్తున్నారని తెలిపారు. దళితుడు సత్యవర్ధన్‌పై దాడి ఘటనలో నిందుతుడైన వల్లభనేని వంశీని జగన్ పరామర్శించారని.. పోలీసులను, అధికారులను బట్టలు ఊడదీయిస్తానని జగన్ అసభ్య పదజాలంతో హెచ్చరిస్తూ భయపెట్టే విధంగా జగన్ మాట్లాడారని అన్నారు. అయన మాటలకూ ఎవరు భయపడేది లేదని, కూటమి పాలనలో రెడ్ బుక్ పేరు వింటే వైసీపీ నాయకులకు తడిసిపోతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *