సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా బిజెపి ఆధ్వర్యంలో భీమవరం AMC రోడ్ లోని కేఎస్ కన్వెన్షన్ లో నేటి గురువారం సాయంత్రం కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఆధ్వర్యంలో ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పైన మేధావుల సమావేశం నిర్వహించారు. దీనిలో జిల్లాకు చెందిన పలువురు పెద్దలు పాల్గొని బడ్జెట్ ఫై కొన్ని సంశయాలను చర్చకు పెట్టారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో ” సబ్ కా సాత్ – సబ్ కా వికాస్ – సబ్ కా విశ్వాస్ ” లక్ష్యంగా దేశంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి ధ్యేయంగా..ఈసారి బడ్జెట్ లో కేంద్రము మన రాష్ట్రానికి మన నరసాపురం పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి కి చేసిన ఆదనపు ప్రయోజనాలు ప్రత్యేక నిధులులను ,అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి వర్మ సభికులకు వివరించారు. పెద్దల సూచనలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొనివెళతానని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా , బిజెపి సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ హాజరు అయ్యి సన్మానం అందుకొన్నారు. ఈ సమావేశానికి భీమవరం, తాడేపల్లిగూడెం కు చెందిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, వ్యాపారస్తులు, విద్యావేత్తలు, న్యాయవాదులు పలు రంగాల్లోని ప్రముఖులు విచ్చేసి కేంద్ర బడ్జెట్ పైన తమ అభిప్రాయాన్ని తెలిపారు.
