సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మొన్నటి వరకు మహారాష్ట్ర, తెలంగాణల్లో కలకలం రేపిన గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) ప్రస్తుతం రాష్ట్రంలో కూడా నెమ్మదిగా వ్యాపించింది. ఈ వ్యాధి కలుషిత ఆహారం వల్ల సోకుతుందని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.ఈ వ్యాధి సోకినా రోగులలో త్వరగా అలసిపోవడం, నరాల బలహీనత ఉన్నట్లు, గొంతునొప్పి, ఒళ్ళు నొప్పులతో ఉన్నట్లు, ఎముకుల జాయింట్స్ సూదులతో గుచ్చినట్లు లక్షణాలు కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు జీబీఎస్ (GBS) కేసులతో ముగ్గురు మృతి చెందినట్లు వైద్య అధికారులు తాజగా నేడు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. గుంటూరు జీజీహెచ్‌లో నలుగురు చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు జీజీహెచ్‌లో ఇద్దరు మృతి చెందారు. అంతకుముందు ప్రకాశం జిల్లా అలసందలపల్లికి చెందిన కమలమ్మ జీబీఎస్‌తో గుంటూరు సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ప్రస్తుతం కర్నూలు లో మరో కేసు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ప్రభుత్వం కూడా గట్టి చర్యలు చేపట్టింది. జీబీఎస్ వ్యాధి సోకిన కొన్ని కేసుల్లో రోగులకు కండరాలు పూర్తిగా పని చేయకపోవడం గుండె వేగం మారడం, ఊపిరితిత్తుల సమస్యలు సంభవించి మరణాలు సంభవిస్తున్నాయి.
