సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రేపటి సోమవారం నుండి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని తనతో పాటు కలపి 11 మంది వైసీపీ ఎమ్మెల్యే లు అసెంబ్లీ కి హాజరు కావాలని , అలాగే శాసనమండలి లో వైసీపీ ఎమ్మెల్సీ లు కూడా అందరు హాజరు కావాలని పిలుపు నిచ్చారు. కూటమి ప్రబుత్వం ఏర్పడి సుమారు 9 నెలలు కావస్తున్నా నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలుపై గట్టిగ ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్యూహాత్మకంగా వైసీపీ అడుగులు వేస్తుంది. గతంలో అసెంబ్లీ ఉప సభాపతి రఘురామా కృష్ణంరాజు కూడా జగన్ ను అసెంబ్లీ కి హాజరు కావాలని అప్పుడే సభ రసవత్తరంగా ఉంటుందని వరుసగా 60 పనిదినాలు శాసనసభకు హాజరుకాకపోతే ఆ సభ్యుడి సభ్యత్వం రద్దువుతుంది.అన్న విషయం జగన్ గుర్తుంచుకోవాలని ఏ సభ్యుడైనా 60 పనిదినాలు సభకు సరైన కారణాలతో లీవ్ పెట్టకుండా రాకపోతే అతని సభ్యత్వం పై వేటు పడుతుందని పేర్కొనడం గమనార్హం.. .
