సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అసెంబ్లీ నుండి వాకౌట్ చేసినాక నేడు తాజాగా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆ పార్టీ అధినేత జగన్ భేటీ అయ్యారు. ఈ భేటీలో కీలక ప్రకటన చేశారు జగన్. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం లేదని ప్రజలకు తెలియ జెప్పడానికే నేడు అసెంబ్లీ కి వచ్చాము. వైసీపీ కి హోదా ఇచ్చే వరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని నిర్ణయించారు. అసెంబ్లీకి వెళ్లినా.. వెళ్లకున్నా.. ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని.. ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పోరాటం సాగిద్దామని వారికీ జగన్ పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. మరో ప్రక్క జమిలి ఎన్నికలు వస్తున్నాయ్ అంటున్నారు. 2028 ఫిబ్రవరిలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం వుందని సమాచారం అందుతోందన్న నేపథ్యంలో వైసీపీ నేతలు ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. పేదలకు ఇచ్చిన ఇళ్ళ స్థలాలు కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకుంటామని వైసీపీ నేతలు జగన్ వద్ద చెప్పగా .. గతంలో .. పేదలకు వైసీపీ ఇచ్చిన ఇళ్ల స్థలాలు వెనక్కి తీసుకోవడం కుదరదని ఎక్కడైనా అలాంటి సంఘటనలు జరిగితే బాధిత ప్రజలకు అండగావైసీపీ పోరాడుతుందని జగన్ అన్నారు.
