సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు గురువారం ఉదయం పంచారామ క్షేత్రమైన భీమవరం శ్రీసోమేశ్వర జనార్ధన స్వామి దేవస్థానంలో మహా శివరాత్రి కళ్యాణ మహోత్సవాన్ని సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) దంపతులు తెల్లవారు జామున స్వామి వారికి పట్టు వస్త్రాలను అందించారు. కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం దేవస్థాన అర్చకులు కళ్యాణ క్రతువుని శాస్త్రోక్తంగా జరిపించారు. శివ నామ స్మరణతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మికత సంతరించుకుంది. అధిక సంఖ్యలో భక్తులు కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
