సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. భీమవరంలోని పిఎస్ఎమ్ గర్ల్స్ హైస్కూల్లో గురువారం మధ్యాహ్నం 389 పోలింగ్ బూత్ లో తన పట్టభధ్రుల ఓటు హక్కును వినియోగించు కున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓటు వేయటం తన బాధ్యతగా భావించి సుదూర ప్రాంతం నాగాలాండ్ నుండి వచ్చి తన ఓటు హక్కును వినియోగించు కున్నానని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు గల ప్రతి ఒక్కరు నిర్లక్ష్యం లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని, సేవా గుణం గల వ్యక్తిని ఎన్నుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రి వర్మ వెంట బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కలిదిండి వినోద్ వర్మ, బిజెపి నియోజవర్గ కన్వీనర్ సురేంద్ర, టిడిపి నాయకులు రామలింగరాజు, పలువురు జనసేన, టీడీపీ , బిజెపి నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
