సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:ప్రయాణపు టికెట్స్ కోసం రైల్వే స్టేషన్(Railway )కు వెళ్ళితే అక్కడ , బుకింగ్ కౌంటర్ వద్ద రద్దీని చూసి బయపడనవసరం లేకుండా రైల్వే అధికారులు సువర్ణ అవకాశం కల్పించారు. అన్‌రిజర్వ్‌డ్ టికెటింగ్ సిస్టం(యూటీఎస్) యాప్ ద్వారా టికెట్లు తీసుకుంటే 3 శాతం క్యాష్ బ్యాక్ వంటి డబ్బు ఆదా చేసుకొనే సౌకర్యం కల్పించింది దక్షిణ మధ్య రైల్వే..కొందరు రైల్వే స్టేషన్‌కు రావడం బుకింగ్ కౌంటర్ వద్ద రద్దీ ఉండడం తో అక్కడ ఉన్న ఏటీవీఎం (ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మిషిన్)లను ఉపయోగిస్తారు. 2016లో హైదరాబాద్ జంట నగరాల్లో 26 సబర్బన్ స్టేషన్‌లలో జోన్ వారీగా యూటీఎస్ మొబైల్ ఆప్లికేషన్‌ను ప్రశేపెట్టింది.అయితే ఇటీవల స్మార్ట్‌ఫోన్ ఉన్న వారు దాదాపు రైలు ప్రయాణం కోసం ఇంటి నుంచే ఆన్‌లైన్ సేవలు వినియోగించుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్ లో యూటీఎస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని టికెట్ కొనుకుని సులువుగా రైలు ప్రయాణం చేయవచ్చు. లేదంటే ప్రయాణికులు నేరుగా బుకింగ్ కౌంటర్ వద్దకు వచ్చి కౌంటర్ల వద్ద యూటీఎస్ క్యూ ఆర్ కోడ్‌ను వినియోగించుకొనే అవకాశం ఉంది.
