సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక ప్రక్క ఎండలు మండుతున్నాయి. ఇంతలో బంగాళాఖాతంలో తూర్పు దిశ గాలుల్లో మార్పు కారణంగా నేటి శుక్రవారం నుంచి మార్చి 3వ వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండటంతో ఏపీలోని రాయలసీమ లో పలు ప్రాంతాలతో పాటు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తమిళనాడులో ఆయా జిల్లాల కలెక్టర్లు ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రజలకు అవసరమైన సహాయ సామగ్రిని సిద్ధం చేసివుంచుకోవాలని, సీఎం స్టాలిన్ ఆదేశించారు. నేటి శుక్రవారం నుండే తంజావూరు, పుదుక్కోట, రామనాథపురం, శివగంగై, విరుదునగర్, తేని, మదురై, దిండిగల్, వంటి పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతుండటం గమనార్హం.
