సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బర్ద్ ఫ్లూ ప్రభావం తగ్గిన నేపథ్యంలో పశ్చిమగోదావరి గోదావరి జిల్లా లో ప్రజలు తిరిగి చికెన్, కోడి గ్రుడ్లు తమ ఆహారంగా తీసుకోవచ్చునని అయితే తణుకు సమీపంలోని వేల్పూరు గ్రామములోని కృష్ణా నందం కోళ్ల పారం నుండి ఒక కిలోమీటర్ పరిధిలో, పెదతాడేపల్లి గ్రామములోని రామలక్ష్మి కోళ్ల పాఠం నుండి ఒక కిలోమీటర్ పరిధిలో మినహా జిల్లాలోని అన్ని గ్రామాలలో గుడ్లు మరియు చికెన్ అమ్ముట, కొనుటకు పౌల్ట్రీ యజమానులు కు ఏ విధమైన ఆంక్షలు లేవని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి నేడు, శుక్రవారం ప్రకటించారు. ప్రజలు ఏ విధమైన అపోహలు లేకుండా బాగా ఉడికించిన గుడ్లు, ఉడకబెట్టిన కోడి మాంసము తీసుకోవచ్చని తెలిపారు. చికెన్ మరియు గుడ్లు షాపులు, రెస్టారెంట్ యజమానులు వ్యాపారాలు కొనసాగించ వచ్చునని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
