సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 38 సంవత్సరాలుగా ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్న భూపతిరాజు నాగ శిరోమణి పదవి విరమణ మహోత్సవాన్ని భీమవరం కొడవల్లి రోడ్ లోని కేఎస్ ఫంక్షన్ హాల్ లో గత గురువారం రాత్రి నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి, జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాణి, బిజెపి రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ పాక సత్యనారాయణ, బిజెపి జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు హాజరై పదవీ విరమణ చేస్తున్న శిరోమణి ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ తన ముగ్గురు సోదరీమణులతో పాటు తాను కూడా ఉపాధ్యాయ వృత్తిని చేశానని, 50 సంవత్సరాల క్రితమే ఆడపిల్లలు తమ కాళ్లపై తాము నిలబడాలంటే విద్య ద్వారానే సాధ్యమని తన తండ్రి భావించి తన ముగ్గురు సోదరీమణులను చదివించారన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీసి దేశ భవిష్యత్తులో వారు కీలక బాధ్యత వహించేలా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని, విద్యార్థులకు మార్కులు కొలమానం కాదని ఉపాధ్యాయులకు పదవీ విరమణ అనేది లేదన్నారు. తను రాజకీయాల్లో బిజీగా ఉండటంవల్ల త్వరలో తన తండ్రి పేరు మీద ఏర్పాటు చేసే ట్రస్ట్ నిర్వహణ బాధ్యతను ముగ్గురు సోదరీమణులు చూస్తారని, ఎంపీ గా ఐదు సంవత్సరాలు తనకు ప్రభుత్వ నుండి వచ్చే డబ్బును కూడా ట్రస్ట్ కు కేటాయిస్తానని శ్రీనివాస వర్మ తెలిపారు
