సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా గమనించిన అంశం ఆఖరికి విషాదంగా మిగిలింది.తెలంగాణ లోని ఎస్ఎల్బీసీ టన్నెల్ లో గత 4 రోజులు క్రితం . సొరంగం త్రవ్వకాలలో జరిగిన ప్రమాదంలో బురద నీరు, కొండ చర్యలు పడిపోయి చిక్కుకుపోయిన ఎనిమిది మంది మృతి చెందినట్లు నేడు, శనివారం సాయంత్రం తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారికంగా ప్రకటించారు. ఇంకా త్రవ్వకాలు జరుగుతున్నాయని వారి మృతదేహాలను రేపు ఆదివారం మధ్యాహ్నం కల్లా బయటకు తీసి వారి కుటుంబీకులకు అప్పగిస్తామని తెలిపారు. ఈరోజు ఉదయం టన్నెల్ ప్రమాదస్థల ప్రాంతానికి మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి,జూపల్లి కృష్ణారావు , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి చేరుకుని అక్కడి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. టన్నెల్లో సహాయక చర్యల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని తెలిపారు. రాడార్ ద్వారా నలుగురి మృతదేహాలు ఒకచోట.. మరో ఇద్దరివి మరోచోట.. మరో ఇద్దరివి మరోచోట గుర్తించారని తెలిపారు.
