సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న సినీనటుడు, పోసాని కృష్ణ మురళి శనివారం మధ్యాహ్నం అస్వస్థతకు గురవడంతో వెంటనే రాజంపేట సబ్ జైలు నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గుండెనొప్పి వచ్చినట్లు జైలు అధికారులకు పోసాని కృష్ణ మురళి చెప్పారు. రాజంపేట ప్రభుత్వ ఆస్పతికి జైలు అధికారులు తరలించారు. రాజంపేట ప్రభుత్వాస్పత్రిలో పోసాని కృష్ణ కు విపరీతంగా మోషన్స్ కావడంతో పాటు పల్స్ లో బాగా తేడాలు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు పోసానిని ఇంకా మెరుగైన వైద్యం కోసం రాజంపేట ప్రభుత్వాస్పత్రి నుంచి కడప రిమ్స్‌కు తరలించారు. అయితే పోసానిని అంబులెన్సు లో కాకుండా పోలీస్ జీప్ లో కూర్చోబెట్టి తరలించడం ఫై అక్కడికి చేరుకొన్న వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాద్ రెడ్డి మరియు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసారు. ఇప్పటికే ఆపరేషన్ చేయించుకున్న పోసాని ని కక్ష లో గంటల పాటు త్రిపి త్రిపి హైదరాబాద్ నుండి తీసుకొనివచ్చారని ఏకంగా 9 గంటల పాటు ఎదో హత్య కేసు నిందితుడిలా విచారణ పేరుతొ అధికారులు వేధించారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
