సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ నేడు, మంగళవారం మధ్యాహ్నం కొద్దీ సేపటి క్రితం పూర్తీ అయ్యాయి. ముందుగా ఊహించినట్లే.. ఉభయగోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా టీడీపీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ఘన విజయం సాధించారు. సమీప పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులుపై పేరాబత్తుల గెలుపొందారు. ఇప్పటి వరకు జరిగిన ఏడు రౌండ్లలోనూ రాజశేఖరం ఆధిక్యంలో నిలిచారు. ఆయన మొత్తం లక్షా 12వేల 331 ఓట్లు సాధించారు. అలాగే పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులుకు 41,268 ఓట్లు వచ్చాయి. ఈ క్రమంలో వీర రాఘవులుపై పేరాబత్తుల రాజశేఖరం 71,063 ఓట్ల ఆధిక్యతలో నిలిచారు. విజయానికి కావాల్సిన పోలైన ఓట్లలో 50 శాతం మొదటి ప్రాధాన్యత ఓట్లను సాధించారు. పేరాబత్తుల రాజశేఖరం విజయం కోసం కూటమి పార్టీలు టీడీపీ జనసేన, బీజేపీ నేతలు సమన్వయంతో పని చెయ్యడం మంచి ఫలితాన్ని ఇచ్చింది.
