సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం శాసనమండలిలో మంత్రి లోకేష్ కు వైసీపీ సబ్యులకు, వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ కు మధ్య హోరాహోరీ వాదన జరిగింది. ఇటీవల రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్య ను బోధించే విశ్వ విద్యాలయాలలో వైస్ ఛాన్సలర్ లను సైతం బెదిరించి రాజీనామాలు చేయించారని, వారిని బెదిరించకపోతే మొత్తం 12 మంది వైస్ ఛాన్సలర్లు ఎలా రాజీనామా చేశారని ప్రశ్నిస్తూ.. మీరు దీనిపై విచారణకు ఆదేశించాలని మండలిలో బొత్స సత్యనారాయణ స్పీకర్ కొయ్యే మోషేను రాజునూ కోరారు. బొత్స వ్యాఖ్యలపై మంత్రి లోకేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో రికార్డులు తీయాలని.. ఆ రికార్డ్‌లో టీడీపీ ప్రభుత్వం బెదిరించినట్టు వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలను లోకేష్ ప్రస్తావించారు. వెంటనే తాము ఇచ్చిన ప్రివిలేజ్ నోటీస్‌ను ప్రివిలేజ్ కమిటీకి పంపాలని కోరారు. బెదిరించలేదని నేను ఆధారాలు చూపించాను. అందువలనే ప్రివిలేజ్ మోషన్‌ను నేను మూవ్ చేస్తున్నాను’’ అని లోకేష్ తెలిపారు. ఇంగ్లీష్‌లో త్రెటెన్ అనే పదం ఉందా చూపించాలంటూ మండలిలో మంత్రి సవాల్ చేశారు. రాజారెడ్డి చెల్లెలు వైసీపీ నేత, ప్రసాద రెడ్డి వైసీపీ కార్యకర్త…. వీళ్లా వైస్ ఛాన్సలర్‌‌లు? అని ప్రశ్నించారు. దమ్ముంటే వైస్ ఛాన్సలర్‌లు చేసిన రాజీనామా లేఖల్లో బెదిరించినట్లు ఎక్కడైనా ఉందా నిరూపించాలన్నారు. వైసీపీ నేత బొత్స తమ సభ్యులను లేచి నుంచొని నిరసన చెప్పాలని కోరుతున్నారని ఈ సందర్భంగా లోకేష్ ఆరోపించారు. దీంతో మంత్రులు టీడీపీ, వైసీపీ సభ్యులు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సభలో పరిస్థితి అదుపు తప్పడంతో సభను చైర్మన్ మోషన్ రాజు వాయిదా వేశారు. అయితే బ్రేక్ తరువాత శాసనమండలి ప్రారంభమవగా.. వెంటనే వైసీపీ సభ్యులు కూటమి ప్రభుత్వ పెద్దలు వీసీలను బెదిరించిన వ్యవహారంపై విచారణ జరుపాలని వెల్‌లోకి వెళ్లి మరీ నినాదాలు చేశారు. విచారణపై మంత్రి సమాధానం చెప్పాలని.. ప్రభుత్వం తరపున మంత్రులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని చైర్మన్ కొయ్య మోషేను రాజు వైసీపీ సభ్యులను కోరారు. అయినా నినాదాలు చేస్తున్న వైసీపీ సభ్యులపై చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలి చైర్మన్ సభను రేపటి(బుధవారం)కి వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *