సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి తణుకు ఎమ్మెల్యేగా గెలిచిన చిట్టూరి వెంకటేశ్వరరావు నేడు, . బుధవారం మరణించారు. పెద్ద వయస్సు కావడంతో అయన కొంత కాలంగా అస్వస్థతతో బాధపడుతూ మృతి చెందిన నేపథ్యంలో తణుకు లో టీడీపీ పార్టీ పెద్ద దిక్కు కోల్పోయింది. ఈ నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు ఆయన బోతిక కాయానికి నివాళ్లు అర్పించారు. అంత్యక్రియలు నేపథ్యంలో స్వర్గీయ వెంకటేశ్వరరావు భౌతికకాయాన్ని తణుకు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సందర్శించి నివాళులు అర్పించారు.తదుపరి అంత్యక్రియల్లో తరలింపులో పాల్గొని ఆయన పాడేను మోసి తన అభిమానాన్ని చాటుకొన్నారు.
