సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని నేడు, గురువారం ఉదయం దర్శించుకున్న కోలమూరు గ్రామానికి చెందిన కూనపరాజు బాలాజీ రాజు దంపతులు 7 గ్రాముల బంగారం అమ్మవారికి కానుకగా అందజేశారు. వీరికి అలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించి శేషవస్త్రం ప్రసాదాలు అందజేశారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
