సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచంలో చైనా తరువాత బంగారం వినియోగం భారత్ లోనే ఎక్కువ.. అలానే ఆకస్మికంగా అవసరం వచ్చిన తప్పని పరిస్థితులలో బంగారం తాకట్టు పెట్టి వెంటనే రుణం తెచ్చుకోవడం కూడా ప్రజలకు అలవాటు.. అది కూడా బ్యాంకుల ద్వారా అయితే చాల తక్కువ వడ్డీకే బంగారం ఫై ఋణం లభిస్తుంది. అయితే ఇకపై బ్యాంకులలో బంగారం తాకట్టు పెట్టి ఋణం పొందడం అంత సులభం కాకపోవచ్చు. ఎందుకంటారా..? గోల్డ్ లోన్ నిబంధనలను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మరింత కఠినతరం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. పసిడి రుణాల మంజూరులో బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలు అనుసరిస్తున్న అనుచిత విధానాలపై 2024 సెప్టెంబరు 30న ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఇక ఫై ఈ రుణాల మంజూరు ప్రక్రియలో నిబంధనలను కఠినంగా పాటించాలని, రుణగ్రహీత నిధులను ఎందుకోసం ఖర్చు చేయనున్నారనే విషయంపైనా కూడా విచారించాలని బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలను ఆర్‌బీఐ ఆదేశించనున్నట్లు సమాచారం. అంతేకాదు, రుణగ్రహీతల బ్యాక్‌గ్రౌండ్‌నూ చెక్ చేయాలని, తాకట్టు పెట్టే బంగారం వాస్తవ హక్కుదారు ఎవరనేదీ తెలుసుకోవాలని నిబంధనలలో చేరుస్తారని సమాచారం.
