సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శ్రీ విష్ణు ఇంజినీరింగ్ మహిళా కళాశాల, భీమవరంలో మార్చి 7 & 8, 2025 తేదీలలో జాతీయ స్థాయి మహిళా సాంకేతిక సదస్సు ‘టెక్నోవా 2025’ మరియు 24వ కళాశాల వార్షికోత్సవ వేడుకతో పాటు మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. కళాశాల ప్రిన్సిపాల్ డా. జి. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. . విద్యార్థినులు తమ స్వంత ఆలోచనలతో విజయ పథాన్ని నిర్మించుకోవాలని ప్రోత్సహించడంతో పాటు, కార్పొరేట్ ప్రపంచంలో ఎదగడానికి అవసరమైన నైపుణ్యాలు, ఆలోచనా విధానం, వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడం ఎంత ముఖ్యమో వివరించారు. శ్రీ విష్ణు సొసైటీ, స్టూడెంట్ అఫైర్స్ & అడ్మిన్ డైరెక్టర్ డా. పి. శ్రీనివాస రాజు మాట్లాడుతూ, కార్పొరేట్ రంగంలో మహిళలు అనేక విభాగాల్లో రాణిస్తున్నారని, అందుకే మహిళా ఇంజినీర్లు మరియు మేనేజర్‌లకు విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ రెండు రోజుల సాంకేతిక సదస్సులో ఎన్‌ఐటీ వరంగల్, ఎన్‌ఐటీ ఆంధ్రప్రదేశ్, ఐఐఐటీ శ్రీ సిటీ, హైదరాబాద్ విశ్వవిద్యాలయం మరియు ఇతర రాష్ట్ర, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల తోపాటు 108 ఇంజినీరింగ్ కళాశాలల నుండి 2000 మందికి పైగా విద్యార్ధినిలు పాల్గొన్నారు.ఈ సాంకేతిక సదస్సులో విజేతలైన విద్యార్థులకు బహుమతులు మరియు సర్టిఫికెట్లు అందజేయడంతో పాటు, లక్ష రూపాయల నగదు పురస్కారాలు కూడా ప్రదానం చేయబడ్డాయి. సీనియర్ బోధనా మరియు బోధనాేతర సిబ్బందికి కళాశాల యాజమాన్యం సత్కరించింది.
