సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈనెల 4వ తేదీన రాయచోటి లో శ్రీ వీరభద్ర స్వామివారి దేవాలయంవద్ద జరుగుతున్నా జాతర ఉత్సవం ఫై కొందరు మతోన్మాదులు జరిపిన దాడికి నిరసనగా, పాల్బడిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా హిందూ భక్తులకు కులమత రహితంగా సంఘీభావ యాత్ర కు విశ్వ హిందూ పరిషత్ పిలుపు ఇచ్చింది. ఆమేరకు భీమవరంలో రేపు సోమవారం (10 వ తేదీ) ఉదయం 10 గంటలకు స్థానిక కొత్త బస్టాండ్ దగ్గర కేశవరావు హై స్కూల్ గ్రౌండ్ కు పెద్ద ఎత్తున న వ్యాప్తంగా హిందూ భక్తులు హాజరు అయ్యి అక్కడి నుండి ప్రక్రుతి ఆశ్రమంలో ఉన్న జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు జరిగే నిరసన ర్యాలీ కార్యక్రమం లో పాల్గొనాలని భీమవరం vhp శాఖ పిలుపు నిచ్చింది.
