సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లో వేంచేసి యున్న పంచారామక్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు ప్రతి రోజు దూరప్రాంత భక్తుల కోసం మధ్యాహ్నం నిర్వహిస్తున్న మహా ప్రసాద వితరణ కోసం దేవాలయం లోని నిత్య అన్నదానం ట్రస్టు నకు స్థానిక భక్తులు అచ్చం గణపతి కృష్ణమూర్తి మరియు వీరి కుమార్డు అచ్చం వెంకటేశ్వర రావు గార్ల చే శాశ్వత నిత్యఅన్నదానం పధకం నిమిత్తం రూ.2,00,115/-లు కానుకగా అందజేశారు. వారికీ దేవాలయం కార్యనిర్వహణాధికారి డి రామకృష్ణంరాజు మంత్రోచ్ఛరణలతో శ్రీ స్వామివారి దర్శనం చేయించి ప్రసాదం జ్ఞాపిక అందజేశారు.
