సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: గతంలో 7 ఏళ్ళ క్రితం తెలుగునాట రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో ఆఖరి తీర్పును నేడు, సోమవారం నల్లగొండ కోర్టు ప్రకటించింది. .ఇందులో ప్రధాన ఏ 1 నిందితుడు మారుతీరావు మరణించడంతో ఏ 2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. నిందితులు అందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఎస్సీ, ఎస్టీ సెషన్స్ రెండో అదనపు న్యాయ స్థానం కీలక తీర్పు ప్రకటించింది. శిక్ష తగ్గించాలని న్యాయమూర్తిని ఈ సందర్భంగా నేరస్తులు వేడుకున్నారు. హార్ట్ పెషేంట్, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, చిన్న పిల్లలు ఉన్నారని కొందరు నేరస్తులు న్యాయ స్థానానికి తెలిపారు. ప్రణయ్ హత్యలో సుభాష్ శర్మ కీలకపాత్ర పోషించాడు. ఇప్పటికే జైల్లో ముగ్గురు నిందితులు శిక్ష అనుభవిస్తున్నారు. కిల్లర్ అస్గర్ అలీకి సుపారీ ఇచ్చి ప్రణయ్‌ను అమృత తండ్రి హత్య చేయించాడు. ఏడుగురితో ఓ గ్యాంగ్‌ను అస్గర్ అలీ ఏర్పాటు చేశాడు.. 2018 సెప్టెంబర్ 14వ తేదీన హత్యకు ప్రణయ్ గురయ్యాడు. గర్భవతిగా ఉన్న భార్య అమృతను నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఆస్పత్రికి తీసుకువెళ్లి.. తిరిగి వస్తుండగా.. దుండగులు ప్రణయ్‌పై కత్తులతో దాడి చేసి హతమార్చారు. తన కూతురిని కులాంతర వివాహం చేసుకున్నాడనే కక్షతో సుఫారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను మారుతీరావు హత్య చేయించాడు. ప్రస్తుత హైడ్రా కమిషనర్ అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్ పర్యవేక్షణలో విచారణ పూర్తిచేసి హత్యకేసుల్లో ఎనిమిది మంది నిందితుల పాత్ర నిర్ధారించారు. ఈ తీర్పు ఫై హైడ్రా.. రంగనాధ మాట్లాడుతూ..ఈ కేసు ఎందరికో గుణపాఠంగా నిలుస్తుందని ఇందులో యవ్వనంలో ఉన్న యువత జీవితంలో స్థిరపడకుండా ప్రేమ పేరుతొ ఆవేశపడితే వచ్చే నష్టం తోపాటు డబ్బు ఉందని పిల్లల ఎదుగుదల వారి వ్యవహారాలపై శ్రద్ద పెట్టక తరువాత ఆవేశ పడితే ఎంత మూల్యం చెల్లించుకోవాలో జీవితం మూల్యం చెలించిన మారుతీరావు ను చుస్తే అర్ధం అవుతుందన్నారు. ఈ కధ ను మర్డర్ సినిమా గా రాంగోపాల్ వర్మ చక్కగా తీసి ప్రశంసలు అందుకోవడం విశేషం.
