సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు సమీపంలోని వందల ఏళ్ళ చారిత్రక ప్రసిద్ధి పొందిన కొల్లేటికోటలో పెద్దింట్లమ్మగా పిలవబడే జలదుర్గ అమ్మవారికి, గోకర్ణపురంలోని గోకర్ణేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులుపోటెత్తిపోయారు. తెల్లవారు జాము 2.16 గంటల కు స్వామి, అమ్మవార్ల కల్యాణానికి భారీ ఎత్తున తెలుగు రాష్ట్రాల నుండి కర్ణాటక నుండి భక్తులు తరలివచ్చారు. తొలుత గోకర్ణపురం నుంచి కొల్లేటికోటకు గోకర్ణేశ్వర స్వామిని పల్లకీలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. ప్రత్యేక పూజలనంతరం కల్యాణతంతు మొదలైంది. పందిరిపల్లిగూడెం గ్రామస్థులు ఏర్పా టుచేసిన భారీప్రభ ఊరేగింపులో కూటమి నేతలు ప్రత్యేక పూ జలు చేశారు. 25 వేల మంది పైబడి భక్తులు పాల్గొన్నారు. కల్యాణ ఏర్పాట్లను ఆల య ఈవో కూచిపూడి శ్రీనివాసు పర్యవేక్షించారు. కార్యక్రమాల్లో మాజీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు దంపతులు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.
