సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రముఖ సినీ సీనియర్ నటుడు, మాజీ కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవి కి అరుదైన గౌరవం దక్కింది. 4 దశాబ్దాలకు పైగా సినిమా పరిశ్రమలో కొనసాగుతూ, బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు ద్వారా చేస్తున్న ప్రజా సేవలకు గానూ .. వ్యక్తిగతంగా చేసిన దాతృత్వానికి.. ఆదర్శప్రాయమైన ఆయన కృషిని యునైటెడ్ కింగ్ డమ్ బ్రిటిష్ ప్రభుత్వం (UK Government) గుర్తించినట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా పార్లమెంట్‌ (Parliament) లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో చిరంజీవిని సత్కరించనుంది. ప్రజా సేవలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు మెగాస్టార్ చిరంజీవికి ఈ నెల 19న‘జీవిత సాఫల్య పురస్కారం’ ప్రధానం చెయ్యనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *