సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో నేడు, శుక్రవారం మరియు పౌర్ణమి నేపథ్యంలో విశేషంగా దూరప్రాంతాల నుండి సైతం భక్తులు వచ్చి నిలువెత్తు మూలా విరాట్ స్వరూపంలో ప్రకాశవంతమైన తేజోస్వరూపిణి శ్రీ అమ్మవారిని దర్శించుకొన్నారు. పౌర్ణమి నేపథ్యంలో నేటి ఉదయం ఆలయ ఆవరణలో ప్రజల శాంతి సౌఖ్యాల కోసం విశ్వ శాంతి కోసం శ్రీ అమ్మవారి అనుగ్రహం కోసం ఏర్పాట్లు చేసిన పవిత్ర “చండి హోమం’ వేద పండితుల మంత్రోచ్ఛరణలతో 80 మంది దంపతులు పాల్గొనగా ఘనంగా నిర్వహించామని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
