సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవన్ కళ్యాణ్ ను ఎమ్మెల్యే ను చేసిన పిఠాపురం ప్రజల సాక్షిగా చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ సభ నేడు, శుక్రవారం సాయంత్రం ఘనంగా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి జనసేన కార్యకర్తలు, నేతలు, అభిమానులు పెద్దఎత్తున హాజరయ్యారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు లు ఎమ్మెల్యేలు పార్టీ జిల్లా ప్రసిడెంట్ లు అందరు వేదికను అలంకరించారు. కాగా, లక్షలాదిగా తరలివచ్చిన కార్యకర్తల కోసం ప్రత్యేక గ్యాలరీలను పార్టీ వర్గాలు ఏర్పాటు చేశాయి. ఒక్కో గ్యాలరీలో సుమారు 2,500 మంది కూర్చొనేలా సిద్ధం చేశారు. అయినా భారీగా కార్యకర్తలు తరలిరావడంతో సభా ప్రాంగణం బయటే పెద్దఎత్తున అభిమానులు, కార్యకర్తలు నిలిచిపోయారు. మాజీ వైసీపీ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ మాట్లాడుతూ .. ఇక జన్మలో జగన్ సీఎం కాలేరని, పవన్ కళ్యాణ్ స్వయంగా ఎదిగిన నాయకుడు అని తాను బ్రతికి ఉన్నంత వరకు పవన్ వెంటే ఉంటానని ఆవేశపూరితంగా ప్రసంగించారు. సోదరుడు నాగబాబు మాట్లాడుతూ..”జనసేన నేతలు, కార్యకర్తలు, వీర మహిళలకు జనసేన 12వ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలుపుతూ ఇది పవిత్ర నదులకు పుష్కరాలు వచ్చినంత పవిత్ర దినం అన్నారు. మనకు . అధికారం వచ్చింది కదా అని నేతలెవరూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. అందరూ ఒళ్లు దగ్గరపెట్టుకుని ఉండాలి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఏం జరుగుతుందో చూశాం. నోటి దురుసు ఉన్న నేతకు ప్రతిపక్ష హోదా దక్కలేదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంటి హాస్యనటుడు కలలు కంటూనే ఉంటారు. మరో 20 ఏళ్ల వరకూ కలలు కంటూనే ఉండాలని సలహా ఇస్తున్నా.పిఠాపురంలో ఘన విజయం సాధిస్తామని పవన్‌కు ముందే తెలుసు. అంతే కానీ కొందరు తమ వల్లే గెలిచారని తాము గెలిపించామని చెప్పుకోవడం కరెక్ట్ కాదు ( టీడీపీ వర్మ నుద్దేశించి?) నా వల్లే గెలిచాడు అనుకొంటే అది వారి ‘కర్మ’ అని ప్రజలు బాగోగులు చూసే వ్యక్తి పవన్. పవన్‌లా గొప్ప వ్యక్తి కావాలి అనుకున్నపుడు .ఆయనకు అనుచరుడిగా ఉండాలని” పిలుపు నిచ్చారు.
