సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మను భీమవరంలో ఆయన నివాసంలో రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, కే రఘురామా కృష్ణంరాజు మరియు బీజేపీ నేత, మంత్రి సత్య కుమార్, పరామర్శించారు. రోడ్డు ప్రమాదం జరిగిన తీరును, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇది దైవ కృప, ఈ ప్రాంత ప్రజల దీవెనలు అని, వైద్యులు చెప్పిన విధంగా తగిన విశ్రాంతి తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు. అనంతరం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి వర్మ తనకు మంచి మిత్రులని, ఈ భీమవరం ప్రాంత ప్రజలకు చేస్తున్న సేవల వల్ల ప్రజల ఆశీర్వాదాలతో ఆయన పెను ప్రమాదం నుండి స్వల్ప గాయాలతో బయటపడ్డారని, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో దశాబ్దాల పాటు నర్సాపురం పార్లమెంట్ ప్రజలకు సేవ చేసే భాగ్యం ఆయనకు కలగాలని కోరుకుంటున్నానని అన్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మను పరామర్శించిన వారిలో బిజెపి రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ పాక వెంకట సత్యనారాయణ,కనుమూరి భరత్, ఆకివీడు టిడిపి మండల ప్రెసిడెంట్ మోటుపల్లి ప్రసాద్, బిజెపి జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కలిదిండి వినోద్ వర్మ, నరసాపురం పార్లమెంట్ కన్వీనర్ పేరిచర్ల సుభాష్ రాజు, నాగరాజు, కాగిత సురేంద్ర తదితరులు ఉన్నారు
