సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ జయకేతం బహిరంగ సభ విజయవంతం కావడంతో రాష్ట్రంలో జనసైనికులలో జోష్ పెరిగింది. గత రాత్రి వేదికపై అధినేత పవన్ తన ప్రసంగంలో జై తెలంగాణ, జై ఆంధ్ర అంటూ జనసేన పార్టీ తెలంగాణా గడ్డపై ఆవిర్భవించిందని ప్రసంగం మొదలు పెట్టారు. ఎక్కడా పిఠాపురం నియోజవకర్గం గురించి ప్రత్యేకంగా ప్రస్తావన తేలేదు.అనేక ప్రజా సమస్యలపై విస్తృత అంశాలపై అనర్గళంగా ప్రసంగించారు. అయితే జనసేన ఆవిర్భావం నుండి గత 12 ఏళ్లుగా ఎన్నో కష్ట నష్టాలలో తనతో నచ్చిన క్యాడర్ కృతజ్ఞలు తెలుపుతూ ఇప్పడు జనసేన ఏ స్థాయికి చేరిందంటే 40 ఏళ్ళ తెలుగు దేశం పార్టీని అధికారంలోకి తెచ్చే స్థాయి కి చేరిందని పవన్ చేసిన వ్యాఖ్యలు , నాగబాబు టీడీపీ వర్మ నుద్దేశించినట్లు మాట్లాడిన మాటలును కొందరు టీడీపీ నేతలు ఆగ్రహంతో తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. పవన్ ప్రసంగంలో తమిళనాడులో సీఎం స్టాలిన్ హిందీ బాషా వ్యతిరేక ఉద్యమం చెయ్యడం ఏమిటని, మనమంతా భారతీయులం ఏ బాష అయిన మాట్లాడొచ్చు. తమిళ సినిమాలు హిందీలో డబ్ చెయ్యడం మానెయ్యండి. ఉత్తరాదివాళ్ళ డబ్బులు కావాలి కానీ హిందీ వద్దా ? అని వ్యాఖ్యానించారు. ప్రసంగం మధ్యలో పవన్ అని జనం అరు స్తుండడంతో.. కొంత అసహనం చెందిన పవన్ నా పేరు అరుస్తున్నారు.. అంటే.. నా ప్రసంగం వినడం లేదని అర్థం అని చురకలు అంటించడంతో జనసైనికులు ప్రసంగంపై దృష్టిసారించారు.తొడలు కొట్టే మీసాలు మెలివేసే వారి పరిస్థితి ఏమైందని జగన్‌లా తాను కోడికత్తి రాజకీయాలు చేయడం లేదని సైద్ధాంతిక రాజకీయాలు చేస్తున్నాని అన్నారు. రానున్న రోజుల్లో యువ నాయకులను తయారు చేయడమే లక్ష్యంగా జనసేన ప్రణాళికలు సిద్ధం చేసుకుందన్నారు. సభ ముగిసిన తర్వాత జనం తిరిగి స్వస్థలాలకు తిరిగి వెళ్లే సమయంలో వారందరికీ భోజన వసతిని పార్టీ నేతలు చక్కగా ఏర్పాటు చేసారు.
