సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక ప్రక్క ఉక్రెయిన్ తో రష్యా యుద్దానికి విరామం దిశగా అమెరికా పావులు కడుపుతుంటే .. మరో ప్రక్క తాజగా నేడు, మంగళవారం గాజాపై ఇజ్రాయెల్ మిలిటరీ దళాలు భీకర దాడికి దిగాయి. గత జనవరి19న కాల్పుల విరమణ మొదలైన తరువాత ఇజ్రాయెల్ ఈ స్థాయిలో హమాస్‌పై వైమానిక దాడికి దిగడం ఇదే తొలిసారి. ఈ దాడిలో ఏకంగా 220 మంది? మరణించినట్టు తెలుస్తోంది. ఉత్తర గాజాతో పాటు, గాజా నగరం, డెయిర్ అల్ బలాహ్, ఖాన్ యూనిస్, రఫా, దక్షిణ గాజా తదితర ప్రాంతాలు బాంబు పేళుళ్లతో దద్దరిల్లాయి. హమాస్ ఉగ్రసంస్థకు చెందిన పలు స్థావరాలను టార్గెట్ చేసుకున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఓ ప్రకటనలో తెలిపింది,ఇప్పటికి ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ బందీలను తిరిగి అప్పగించేందుకు హమాస్ పదే పదే నిరాకరిస్తున్న నేపథ్యంలో దాడులకు దిగినట్టు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ ఓ ప్రకటనలో తెలిపారు.
