సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:తెలంగాణ మాజీ సీఎం కెసిఆర్ ఇటీవల మరల తన సంచలన వ్యాఖ్యలతో లైం లైట్ లోకి వస్తున్నారు. తాజగా ఆయన ఏపీ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరిఖని నుంచి పాదయాత్రతో కేసీఆర్ ఫాంహౌస్‌కు చేరుకున్నారు. ఫాంహౌస్‌లో పాదయాత్ర చేసిన బృందంతో బీఆర్ఎస్ పార్టీ అధినేత సమావేశమయ్యారు ఆ నేపథ్యంలో కెసిఆర్ వారితో కలసి మీడియా సమక్షంలో మాట్లాడుతూ.. ఎవరూ శాశ్వతంగా ఉండిపోరు.. పార్టీ ఫీనిక్స్.. ప్రతి ఒక్కడూ కేసీఆరే!.. ఎక్కడికో ఎందుకు ఏపీలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహకారంతో ఎన్డీయే తో పొత్తు లేకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చేది కాదు.. మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుంది..అయితే ఎన్డీయే తో పొత్తు కాదు.. మన పార్టీ సింగిల్ గానే అధికారంలోకి వస్తుంది. అన్నారు. ఈ మాటలే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ క్యాడర్‌కు కొత్త ఉత్సాహాన్నిస్తున్నాయి.
