సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్ల కలెక్షన్స్ సాధించి ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. RRR తో ఎన్టీఆర్ కు జపాన్ దేశంలో ఉన్న క్రెజ్ దృష్ట్యా దేవర సినిమాను జపాన్ భాషలో డబ్ చేసి జపాన్‌లో ఈనెల 28న విడుదల చేస్తున్నారు. ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అక్కడి ప్రేక్షకులతో కలసి ‘దేవర’ చూసేందుకు ఎన్టీఆర్ . భార్య ప్రణతితో కలసి జపాన్ వెళ్లారు. అక్కడ ప్రమోషన్ లలో పాల్గొంటారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ చిత్రంలో, బాలీవుడ్ సినిమా ‘వార్-2’లో నటిస్తున్నారు. హ్యూట్రిక్ రోషన్ తో కలసి ఎన్టీఆర్ మల్టీస్టార్ సినిమా ‘వార్-2’ ఆగస్టు 14న స్వతంత్ర దినోత్సవ కానుకగా థియేటర్లలో విడుదలవుతోంది.
