సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత స్టాక్ మార్కెట్లు లో గత వారం వరుసగా ఐదు రోజుల పాటు దూసుకొనిపోయిన సూచీలు ఈ వారం సైతం అదే తీరున లాభాలలో దూసుకొనిపోయే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా ను నిజం చేస్తూ నేడు, సోమవారం .భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. ఈ ఉదయం సుమారు 11 గంటల సమయంలో సెన్సెక్స్ 763 పాయింట్లు పుంజుకొని 77,678 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 284 పాయింట్లు ఎగబాకి 23,589 దగ్గర కొనసాగుతోంది. ప్రారంభంలో సెన్సెక్స్ 592 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. గత నాలుగు రోజులుగా అమెరికా డాలర్ బలహీన పడుతుండటంతో రూపాయి బలోపేతం అవుతుంది. , డాలరుతో పోలిస్తే రూపాయి విలువ రూ. 85.90 వద్ద ఉంది. ఈ వారం కూడా భారతీయ మార్కెట్లకు విదేశీ జోష్, ఫెడ్,ఎఫ్‌ఐఐల పెట్టుబడుల బూస్టింగ్ భారీగా ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు
